యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి హుండీకి భారీ ఆదాయం
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో భక్తుల కానుకల వెల్లువ కొనసాగుతోంది. గత 20 రోజుల హుండీ లెక్కింపును సోమవారం ఆలయాధికారులు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈఓ బావని ప్రసాద్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి:
- మొత్తం నగదు ఆదాయం: ₹1,52,01,420 (ఒక కోటి 52 లక్షల 1,420 రూపాయలు)
- మిశ్రమ బంగారం: 54 గ్రాములు 500 మిల్లీ గ్రాములు
- మిశ్రమ వెండి: 2 కిలోల 700 గ్రాములు
అలాగే హుండీలో విదేశీ కరెన్సీ కూడా గణనీయంగా లభించింది:
- అమెరికా – 248 డాలర్లు
- ఇంగ్లాండ్ – 15 పౌండ్లు
- కెనడా – 10 డాలర్లు
- యూఏఈ (దిరామ్) – 60
- నేపాల్ – 10
- ఆస్ట్రేలియా – 55
- సౌదీ రియాల్ – 20½
- వియత్నాం – 2,000
- మలేషియా – 1
- థాయ్లాండ్ – 220
- సింగపూర్ – 27
- టాంజానియా – 20,000
- సౌదీ అరేబియా – 50
- ఖతార్ – 1
- న్యూజిలాండ్ – 20
- యూరోప్ (యూరో) – 10
భక్తుల విశ్వాసానికి నిదర్శనంగా ఈ భారీ కానుకలు ఆలయానికి చేరుతున్నాయని అధికారులు తెలిపారు.

Post a Comment