కుంభమేళాతో పాపులర్ అయిన మోనాలిసా ప్రేమ వివాహం
కుంభమేళా సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యి పాపులర్ అయిన మోనాలిసా ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమికుడు ఫర్హాన్ ఖాన్‌తో కలిసి ఆమె కేరళలోని తిరువనంతపురం నగరంలో ఉన్న థంపనూర్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. తమ ప్రేమకు తల్లిదండ్రులు అంగీకరించడం లేదని, తమకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు ఇరువురి కుటుంబ సభ్యులను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడి, పరిస్థితిని సమసిపర్చేందుకు ప్రయత్నించారు. అనంతరం మోనాలిసా తన ప్రియుడు ఫర్హాన్ ఖాన్‌తో కలిసి సమీపంలోని దేవాలయంలో వివాహం చేసుకున్నారు.
సమాచారం ప్రకారం, మోనాలిసా మరియు ఫర్హాన్ ఖాన్‌కు పరిచయం సోషల్ మీడియా వేదిక అయిన Facebook ద్వారా ఏర్పడింది. అక్కడి నుంచి ప్రారంభమైన పరిచయం క్రమంగా ప్రేమగా మారి, చివరికి వివాహ బంధంగా మారింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Post a Comment