-->

ఇంటర్ పరీక్షకు వెళ్తూ ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

పెద్ద షాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – కొత్తూరు వాసులే మృతులు


రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ పరీక్ష రాయడానికి వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండల కేంద్రానికి చెందిన ఇద్దరు విద్యార్థులు బైక్‌పై శంషాబాద్‌లోని ఒక ప్రైవేట్ కళాశాలలో పరీక్ష రాయడానికి బయలుదేరారు. ఈ క్రమంలో పెద్ద షాపూర్ సమీపంలో ఎదురుగా వచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టమ్ కోసం సమీప ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనతో కొత్తూరు ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793