గంజాయి రవాణా ముఠా అరెస్ట్… 1.5 కిలోల గంజాయి స్వాధీనం
మేడిపల్లి: ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ముఠాను మేడిపల్లి పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు జరిపిన దాడిలో నలుగురు నిందితులు అరెస్ట్ అయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన పీర్జాదిగూడ రాయించ్ ఎంక్లేవ్, రోడ్ నెంబర్–8లో ఈ నెల 17న పోలీసులు ఓ ఇంటిపై రైడ్ నిర్వహించారు. సోదాల్లో భాగంగా మూడు ప్యాకెట్లలో దాచిన మొత్తం 1.504 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు.
అదే సమయంలో ఒక వెయింగ్ మెషిన్, ఒక మొబైల్ ఫోన్, నాలుగు బైకులను పోలీసులు సీజ్ చేశారు.
ఈ కేసులో
- దోతుల పృథ్వీరాజ్
- షేక్ సమీర్
- మోదుపల్లి దయాసాగర్
- జంపాల శ్యామ్ కుమార్
అనే నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రాథమిక విచారణలో నిందితులు ఆంధ్రప్రదేశ్‌లోని చింతూరు ప్రాంతం నుంచి గంజాయి కొనుగోలు చేసి, చిన్న ప్యాకెట్లుగా విభజించి బైక్‌లపై సరఫరా చేస్తూ హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు వెల్లడైంది.
నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కాగా గంజాయి సరఫరాదారులు సురేష్ సహా మరికొందరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించిన ఈగల్ టీమ్, మేడిపల్లి పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించినట్లు సీఐ శంకరయ్య తెలిపారు.

Post a Comment