-->

నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల కల నెరవేర్చిన కుమార్తె

నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల కల నెరవేర్చిన కుమార్తె


మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన ఏకారి వెంకటేష్, లక్ష్మి దంపతులు చదువు తెలియని వారైనా, తమ పిల్లలు చదువులో ముందుకు రావాలని పెద్ద కలలు కన్నారు. జీవనోపాధి కోసం తోపుడు బండిపై పండ్లు అమ్ముతూ కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని కుమార్తెల విద్య కోసం ఖర్చు చేశారు.

వారి పెద్ద కుమార్తె లిఖిత ఆ కష్టానికి తగిన ఫలితం అందించింది. ప్రణాళికాబద్ధంగా చదువుతూ, కఠినంగా శ్రమించి, తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైంది. లాసెట్‌లో మంచి ర్యాంక్ సాధించి, ప్రస్తుతం ఎల్‌ఎల్‌ఎం ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తన విజయం వెనుక తల్లిదండ్రుల త్యాగం, పట్టుదలే ప్రధాన కారణమని ఆమె తెలిపింది.

ఇక చిన్న కుమార్తె రసజ్ఞ కూడా చదువులో రాణిస్తూ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేస్తున్నారు.

పేదరికం, నిరక్షరాస్యత అడ్డంకులు అయినప్పటికీ, తల్లిదండ్రుల కష్టం, పిల్లల పట్టుదల కలిసొస్తే విజయాన్ని సాధించవచ్చని ఈ కుటుంబం నిరూపించింది. ఇది ఎన్నో కుటుంబాలకు ప్రేరణగా నిలుస్తోంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793