-->

లక్షా లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన PJTSAU డీన్ డాక్టర్ ఎం. గోవర్ధన్‌

లక్షా లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన PJTSAU డీన్ డాక్టర్ ఎం. గోవర్ధన్‌


హైదరాబాద్, ఏప్రిల్ 8: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU)కు చెందిన వ్యవసాయ కళాశాల అగ్రోనమీ అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం. గోవర్ధన్‌ను తెలంగాణ అవినీతినిరోధకశాఖ అధికారులు లంచం తీసుకుంటుండగా రంగే చేతిలో పట్టుకున్నారు.

అధికారుల వివరాల ప్రకారం, ఒక ఫిర్యాదుదారుడి సంస్థకు విత్తన (సీడ్) లైసెన్స్ జారీ చేసినందుకు ప్రతిఫలంగా రూ.1,00,000 లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా ACB అధికారులు ట్రాప్ నిర్వహించి పట్టుకున్నారు. అలాగే, భవిష్యత్తులో వ్యవసాయ శాఖ అధికారుల నుండి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తానని హామీ ఇస్తూ ముందుగా రూ.25,000 కూడా లంచంగా తీసుకున్నట్లు వెల్లడైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు ACB అధికారులు తెలిపారు.

ప్రజలకు సూచన: ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినా వెంటనే తెలంగాణ అవినీతినిరోధకశాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫోన్ చేయాలని కోరారు.

అదేవిధంగా వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB), మరియు అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అధికారులు స్పష్టం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793