-->

సర్వారంలో పబ్లిక్ రీడింగ్ రూమ్ ప్రారంభించిన నాగ సీతారములు

 

సర్వారంలో పబ్లిక్ రీడింగ్ రూమ్ ప్రారంభించిన నాగ సీతారములు

సుజాతనగర్ మండలం సర్వారం గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూమ్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు, గ్రంథాలయ చైర్మన్ వీరబాబు హాజరయ్యారు. స్థానిక సర్పంచ్ సునీత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి గ్రంథాలయాల పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపారు. యువతలో చదువుపై ఆసక్తి పెంపొందించేందుకు రీడింగ్ రూమ్‌లు ఎంతో ఉపయోగకరమని అన్నారు. గ్రంథాలయ అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి పుస్తకాలు అందించి సహకరించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సహకార సంఘం మాజీ చైర్మన్ మండే వీర హనుమంతరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, గ్రంథాలయ జిల్లా సెక్రటరీ కరుణ కుమారి, ఆఫీస్ ఇంచార్జ్ నవీన్ కుమార్‌తో పాటు స్థానిక యువత, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793