సుజాతనగర్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
సుజాతనగర్ (కొత్తగూడెం): కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సుజాతనగర్ కార్పొరేషన్ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కార్పొరేటర్లు లింగం పుష్పావతి, చింతలపూడి శ్రావణి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా వేల్పుల భాస్కర్, కత్తి బాలకృష్ణ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆలోచన విధానంతోనే సమానత్వ సమాజం సాధ్యమని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించి, వారి సంక్షేమానికి కృషి చేసిన మహానుభావుడిగా అంబేద్కర్‌ను కొనియాడారు. దేశ పురోగతికి ప్రజాస్వామ్య పరిరక్షణే ఏకైక మార్గమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సొసైటీ మాజీ చైర్మన్ మండే వీర హనుమంతరావు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ పిచ్చి రెడ్డి, సుజాతనగర్ తహసీల్దార్ కృష్ణ ప్రసాద్, కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ అశోక్ చౌహాన్, స్థానిక నాయకులు చింతలపూడి సాయి, బొడ్డు కేశవరావు, కోటేష్ నాయక్, నరసింహారావు, రవీందర్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment