-->

నారాయణఖేడ్ కోర్టు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ఘన సన్మానం

నారాయణఖేడ్ కోర్టు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ఘన సన్మానం


నారాయణఖేడ్: నారాయణఖేడ్ కోర్టు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎంఐఎం నారాయణఖేడ్ అధ్యక్షుడు, న్యాయవాది మొహీద్ పటేల్ ఘనంగా సన్మానించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా మారుతిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నర్సింహారావు, కోశాధికారిగా సాయిలు, మహిళా ప్రతినిధిగా భువనేశ్వరి ఎన్నికైన సందర్భంగా వారికి పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా మొహీద్ పటేల్ మాట్లాడుతూ, నూతన కార్యవర్గం న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేయాలని, బార్ అసోసియేషన్ అభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు. నూతన బాధ్యతలు స్వీకరించిన సభ్యులు కూడా తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793