-->

గ్రామీణ యువతికి ఘన విజయం.. మూడు కీలక ఉద్యోగాల్లో ఎంపిక

గ్రామీణ యువతికి ఘన విజయం.. మూడు కీలక ఉద్యోగాల్లో ఎంపిక


జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బొంకూరు గ్రామానికి చెందిన మురళీధర్‌రెడ్డి–మాధవి దంపతుల కుమార్తె ఉన్నతి అరుదైన ప్రతిభ కనబర్చింది. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆమె బీటెక్‌ పూర్తి చేసి వరుసగా పలు ప్రతిష్టాత్మక ఉద్యోగాలను సాధించి అందరి ప్రశంసలు అందుకుంటోంది.

ఉన్నతి బ్యాంకింగ్‌ రంగంలో నిర్వహించే IBPS పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి కెనరా బ్యాంక్‌, తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లలో ప్రొబేషనరీ ఆఫీసర్‌ (PO)గా ఎంపికైంది. అదేవిధంగా న్యూ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టును కూడా సాధించింది.

ఇంతటితో ఆగకుండా స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ (SSC) నిర్వహించిన CGL పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించి GST & కస్టమ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగానికి ఎంపికైంది. అయితే ఈ పోస్టునే తాను ఎంచుకున్నట్లు ఉన్నతి వెల్లడించింది.

గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి వరుసగా మూడు కీలక ఉద్యోగాలను సాధించిన ఉన్నతి విజయం యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆమెను అభినందిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793