క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ కైవసం చైర్ పర్సన్ గా గోడిసెల సంధ్యా రాణి
హైదరాబాద్, ఏప్రిల్ 04 : రాష్ట్రంలో గత కొంతకాలంగా వాయిదా పడుతూ వచ్చిన మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికల ప్రక్రియకు ఎట్టకేలకు ముగింపు లభించింది. తెలంగాణ హైకోర్టు జోక్యంతో ఎన్నికల సంఘం శనివారం ఎన్నికలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఈ నేపథ్యంలో నిర్వహించిన ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) రెండు కీలక మున్సిపాలిటీల్లో ఆధిపత్యాన్ని చాటుకుంది.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉండగా, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు అవసరమైన 15 మంది కౌన్సిలర్ల మద్దతును బీఆర్‌ఎస్ సాధించింది.
దీంతో మున్సిపల్ చైర్మన్‌గా సుదర్శన్ రెడ్డి ఎన్నిక కాగా, వైస్ చైర్మన్‌గా భారతీయ జనతా పార్టీకు చెందిన కౌన్సిలర్ ముత్యాల శ్యామల ఎన్నికయ్యారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీ
క్యాతనపల్లి మున్సిపాలిటీలో కూడా బీఆర్‌ఎస్ విజయ పతాకం ఎగురవేసింది. ఇక్కడ బీఆర్‌ఎస్–భారత కమ్యూనిస్ట్ పార్టీ పొత్తుతో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టింది.
ఈ ఎన్నికల్లో మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బీఆర్‌ఎస్ కౌన్సిలర్ గోడిసెల సంధ్యా రాణి ఎన్నికయ్యారు. ఈ ఫలితాలతో రాష్ట్రంలోని కీలక మున్సిపాలిటీలలో బీఆర్‌ఎస్ తన బలాన్ని మరోసారి చాటుకుంది. కోర్టు కేసుల కారణంగా ఆలస్యమైన ఈ ఎన్నికలు చివరికి పూర్తవడంతో స్థానిక సంస్థల్లో పాలనకు మార్గం సుగమమైంది.

Post a Comment