జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీసు ఓవరాల్ ఛాంపియన్లుగా తెలంగాణ పోలీస్!
Hyderabad, ఏప్రిల్ 04: జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీసులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. వరుసగా మూడోసారి ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు.
2024లో Lucknow, 2025లో Ranchiలో జరిగిన పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచిన తెలంగాణ పోలీసులు, 2026లో Nagpurలో నిర్వహించిన 69వ అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్లో కూడా అదే విజయాన్ని కొనసాగించారు.
ఈ పోటీల్లో తెలంగాణ పోలీసులు ఓవరాల్ ఛాంపియన్ ట్రోఫీతో పాటు యాంటీ-సాబోటేజ్ చెక్, వీడియోగ్రఫీ, కంప్యూటర్ అవేర్‌నెస్ విభాగాల్లో విజేతలుగా నిలిచారు. శాస్త్రీయ దర్యాప్తు సహాయాలు మరియు పోలీస్ ఫోటోగ్రఫీ విభాగాల్లో రన్నరప్ స్థానాన్ని దక్కించుకున్నారు.
ఈ అద్భుత విజయంపై Revanth Reddy తెలంగాణ పోలీసులను అభినందించారు. అలాగే డీజీపీ Shivadhar Reddy మరియు సీఐడీ అడిషనల్ డీజీ Charu Sinhaలను ప్రత్యేకంగా ప్రశంసించారు. వరుస విజయాలతో తెలంగాణ పోలీసులు జాతీయ స్థాయిలో మరోసారి తమ ప్రతిభను నిలబెట్టుకున్నారు.

Post a Comment