-->

బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకంపై దృష్టి పెట్టండి ఏఐసీసీ సూచనలు

  

బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకంపై దృష్టి పెట్టండి ఏఐసీసీ సూచనలు

కొత్తగూడెం: ఏఐసీసీ సూచనలు, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ బూత్‌లో బూత్ లెవెల్ ఏజెంట్ల (BLA) నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్‌ను కోఆర్డినేటర్‌గా నియమించారు.

విద్యానగర్‌లోని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన బూత్ లెవెల్ ఏజెంట్ల నియామక సన్నాహక సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు దేవి ప్రసన్న, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ బూత్ స్థాయిలో పార్టీ బలోపేతానికి BLAల పాత్ర అత్యంత కీలకమని, ప్రతి పోలింగ్ బూత్‌కు సమర్థులైన వ్యక్తులను ఎంపిక చేసి త్వరితగతిన నియామకాలు పూర్తి చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, మాజీ సొసైటీ చైర్మన్లు మండే వీరహనుమంతరావు, కొత్వాల శ్రీనివాసరావు, సర్పంచులు గుగులోతు జానికిరాం, వజ్జా రామారావు, యువజన కాంగ్రెస్ నాయకులు జీవా, రవీందర్, కోటి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793