-->

హిట్-అండ్-రన్ హర్రర్: కారు బోనెట్‌పై వ్యక్తిని 2 కి.మీ. ఈడ్చిన డ్రైవర్

హిట్-అండ్-రన్ హర్రర్: కారు బోనెట్‌పై వ్యక్తిని 2 కి.మీ. ఈడ్చిన డ్రైవర్


హైదరాబాద్, మే 03: నగరంలో మరోసారి భయానక హిట్-అండ్-రన్ ఘటన వెలుగులోకి వచ్చింది. మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దారుణం స్థానికులను తీవ్రంగా కలవరపరిచింది.

రంగారెడ్డి జిల్లా గాయత్రీ నగర్ నుంచి ఎల్.బి. నగర్ వైపు బైక్‌పై వెళ్తున్న ఎస్.కె. జిలానీ మరియు అతని కుమారుడు ఫైసల్‌ను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుని గొడవకు దారితీసింది.

ఈ క్రమంలో కారు డ్రైవర్ తీవ్రంగా ఆగ్రహించి నియంత్రణ కోల్పోయాడు. వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించిన జిలానీని పట్టించుకోకుండా, అతను కారు బోనెట్‌పై వేలాడుతుండగానే దాదాపు 2 కిలోమీటర్ల పాటు ఈడ్చుకెళ్లడం సంచలనంగా మారింది. బాధితుడు నొప్పితో విలవిలలాడుతున్నా కూడా డ్రైవర్ కృరంగా వ్యవహరించడం తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.

ఈ ఘటనను అక్కడి వాహనదారులు వీడియోగా చిత్రీకరించడంతో విషయం బయటపడింది. అనంతరం కారు బాలాపూర్ క్రాస్‌రోడ్స్ వరకు వెళ్లి, తిరిగి మండమల్లమ్మ జంక్షన్ సమీపంలో స్థానికులు అడ్డుకోవడంతో డ్రైవర్ వాహనాన్ని వదిలేసి అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.

ఈ ఘటనలో ఫైసల్‌కు రెండు కాళ్లు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793