-->

అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడులు – 5 లారీలు, జేసీబీ సీజ్

 

అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడులు – 5 లారీలు, జేసీబీ సీజ్

భద్రాద్రి కొత్తగూడెం, మే 3: జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం ఉదయం పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఐదు లారీలు మరియు ఒక జేసీబీని సీజ్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం,

పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు లారీలు, దమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక లారీ, బూర్గంపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు లారీలు మరియు ఒక జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడతారని స్పష్టం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793