-->

పీఎంజే జ్యువెలరీ షాపులో ఐదుగురు దుండగులు తుపాకులతో దూసుకెళ్లి దోపిడీ

 

పీఎంజే జ్యువెలరీ షాపులో ఐదుగురు దుండగులు తుపాకులతో దూసుకెళ్లి దోపిడీ

కరీంనగర్ పట్టణంలో పట్టపగలే జరిగిన భారీ చోరీ కలకలం రేపింది. పట్టణంలోని పీఎంజే జ్యువెలరీ షాపులో ఐదుగురు దుండగులు తుపాకులతో దూసుకెళ్లి దోపిడీకి పాల్పడ్డారు. షాపులోకి చొరబడ్డ అనంతరం సిబ్బందిపై కాల్పులు జరిపినట్లు సమాచారం.

దుండగులు భయభ్రాంతులకు గురిచేసి, భారీ ఎత్తున బంగారు ఆభరణాలను దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793