-->

సరోజ వృద్ధాశ్రమానికి నవ లిమిటెడ్ అండగా.. వంట సామాగ్రి, పరుపులు, మంచములు అందజేత (వీడియో)

సరోజ వృద్ధాశ్రమానికి నవ లిమిటెడ్ అండగా.. వంట సామాగ్రి, పరుపులు, మంచములు అందజేత (వీడియో)


భద్రాచలం : నవ లిమిటెడ్ పాల్వంచ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాలలో భాగంగా మానవసేవ వలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న సరోజ వృద్ధాశ్రమానికి వంట సామాగ్రి, పరుపులు, మంచములు, గృహోపకరణాలు అందజేశారు.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ ఐఏఎస్ హాజరయ్యారు. వృద్ధాశ్రమంలోని వృద్ధుల అవసరాలను నవ లిమిటెడ్ యాజమాన్య దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి అవసరమైన సామగ్రిని అందించారని మానవసేవ వలంటరీ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ శ్రీమతి సరోజ తెలిపారు.

వృద్ధులకు ఉపయోగపడే వంట సామాగ్రి, పరుపులు, మంచములు, గృహోపకరణాలతో పాటు దోమతెరలు, దుప్పట్లు, కండువాలు అందజేసిన నవ లిమిటెడ్ యాజమాన్యానికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా డీజీఎం (ఫైనాన్స్) ఎన్. సత్యనారాయణ మాట్లాడుతూ గత 46 సంవత్సరాలుగా నవ లిమిటెడ్ సంస్థ ఆరోగ్యం, విద్య, జీవనోపాధి రంగాలలో సమాజాభివృద్ధి కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.

ముఖ్య అతిథి సబ్ కలెక్టర్ శ్రీ మృణాల్ శ్రేష్ఠ మాట్లాడుతూ మానవతా దృక్పథంతో వృద్ధాశ్రమానికి అవసరమైన సామగ్రిని అందించిన నవ లిమిటెడ్ సి.ఎస్.ఆర్ కార్యక్రమాలను అభినందించారు.

ఈ కార్యక్రమంలో మేనేజర్ సి.ఎస్.ఆర్ సి.హెచ్ శ్రీనివాస్ రావు, శ్రావణ్, సాయి, సి.ఎస్.ఆర్ సిబ్బంది, వృద్ధాశ్రమ వృద్ధులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793