కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన న్యాయమూర్తికి ఘన స్వాగతం
కొత్తగూడెం, మే 13: కొత్తగూడెం కోర్టులో నూతనంగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి-కమ్ జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి నెరేళ్ల వెంకట హైమ పూజిత గారికి కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లైబ్రరీ హాల్లో ఘన స్వాగత కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి I వ అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి ఎస్. సారిత, సీనియర్ సివిల్ జడ్జి-కమ్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కిరణ్ కుమార్, II వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి-కమ్ జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ రవి కుమార్, III అదనపు జూనియర్ సివిల్ జడ్జి-కమ్ జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వినయ్ కుమార్, I వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి-కమ్ జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కె. సాయి శ్రీ హాజరయ్యారు.
బార్ అసోసియేషన్ సభ్యులు నూతన న్యాయమూర్తి గారికి పుష్పగుచ్ఛాలు అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం సీనియర్ మరియు జూనియర్ అడ్వొకేట్లు ఒక్కొక్కరుగా తమ పరిచయాలను తెలియజేస్తూ నూతన న్యాయమూర్తికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు న్యాయమూర్తులు మాట్లాడుతూ బార్ మరియు బెంచ్ మధ్య సమన్వయం న్యాయ వ్యవస్థ బలోపేతానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. న్యాయవాదులు, న్యాయమూర్తుల మధ్య పరస్పర సహకారం ప్రజలకు వేగవంతమైన న్యాయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పర్వీన్, ప్రధాన కార్యదర్శి మహేశ్వరరావు గడిపెళ్లి, కార్యవర్గ సభ్యులు గడదాసు నాగరాజు, దొడ్డ ప్రసాద్, బానోత్ దేవదాసు తదితరులతో పాటు సీనియర్ మరియు జూనియర్ అడ్వొకేట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment