-->

విద్యార్థినుల కోసం మదర్సా జామియతుస్ సాలిహాత్ ఘనంగా శంకుస్థాపన

విద్యార్థినుల కోసం మదర్సా జామియతుస్ సాలిహాత్ ఘనంగా శంకుస్థాపన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మదర్సా జామియతుస్ సాలిహాత్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మదర్సా శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. అల్లాహ్ కృపాకటాక్షాలతో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ ఇస్లామిక్ పండితులు, మత పెద్దలు, సామాజిక ప్రముఖులు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ ముఫస్సిర్-ఏ-ఖురాన్ హజ్రత్ మౌలానా ముఫ్తీ మహ్మద్ షఫీయుద్దీన్ నఖ్ష్‌బందీ ముజద్దిదీ డీబీ శంకుస్థాపన నిర్వహించారు. హజ్రత్ మౌలానా అబ్దుల్ కరీం రషాదీ నఖ్ష్‌బందీ డీబీ మార్గదర్శకత్వంలో కార్యక్రమం జరిగింది. ప్రస్తుతం ఆయన కొత్తగూడెంలోని మదర్సా ఇస్లామియా దారుల్ ఉలూమ్ నాజిమ్‌గా సేవలందిస్తున్నారు.

మదర్సా జామియతుస్ సాలిహాత్ ప్రత్యేకంగా విద్యార్థినుల కోసం ప్రారంభించబడిన విద్యాసంస్థగా నిర్వాహకులు తెలిపారు. విద్యా, సామాజిక సేవా కార్యక్రమాల అభివృద్ధికి ఈ మదర్సా దోహదపడుతుందని మదర్సా ప్రిన్సిపల్ ముఫ్తీ యాసిర్ నదీమ్ ఖాస్మి పేర్కొన్నారు.

కొత్తగూడెం కిన్నెరస్టిల్ ప్రాంతంలో సుమారు 800 చదరపు గజాల విస్తీర్ణంలో ఆధునిక సౌకర్యాలతో మదర్సా భవన నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ ప్రజలు, మత పెద్దలు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793