ఛత్తీస్‌గఢ్‌లో విషాదం: మందుపాతర పేలుడు.. ముగ్గురు జవాన్లు మృతి
Chhattisgarh రాష్ట్రంలో మరోసారి మావోయిస్టుల దాడి విషాదాన్ని మిగిల్చింది. రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలోని ఛోటాబిటియా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న మార్కాబేడా అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు ముందుగానే అమర్చిన మందుపాతర (IED)ను గుర్తించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి, ఆ మందుపాతరను నిర్వీర్యం చేసే ప్రయత్నంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా అది పేలిపోయింది.
ఈ ఘోర పేలుడు ప్రభావంతో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో జవాన్ తీవ్రంగా గాయపడగా, అతడిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అదనపు బలగాలను ఘటనాస్థలానికి తరలించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మావోయిస్టుల కదలికలపై అప్రమత్తంగా ఉన్న అధికారులు, పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.

Post a Comment