-->

బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భారీ చోరీ.. సీసీ కెమెరాలకు బట్టలు కప్పి దుండగుల దుశ్చర్య

 

బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భారీ చోరీ.. సీసీ కెమెరాలకు బట్టలు కప్పి దుండగుల దుశ్చర్య

బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భారీ చోరీ.. సీసీ కెమెరాలకు బట్టలు కప్పి దుండగుల దుశ్చర్య

నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భారీ చోరీ ఘటన కలకలం రేపింది. ఆలయంలోని పై అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారి గర్భగుడిలోకి ప్రవేశించిన దుండగులు వెండి కిరీటంతో పాటు హుండీని అపహరించారు.

మంగళవారం తెల్లవారుజామున సుప్రభాత సేవలు, నిత్య పూజలు నిర్వహించేందుకు ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాస్ గుడికి చేరుకోగా, గర్భగుడి తాళాలు పగులగొట్టబడినట్లు గుర్తించారు. వెంటనే ఆలయ భద్రతా సిబ్బందికి సమాచారం అందించగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆలయ పూజారి చేత తలుపులు తెరిపించారు. పరిశీలనలో అమ్మవారికి అలంకరించిన వెండి కిరీటం, హుండీ కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు నిర్ధారించారు.

ప్రాథమిక విచారణలో దుండగులు ముందుగా ఆలయంలోని సీసీ కెమెరాలపై వస్త్రాలు కప్పి, అనంతరం గర్భగుడి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించినట్లు వెల్లడైంది. హుండీని తీసుకెళ్లిన నిందితులు అందులోని నగదును స్వాధీనం చేసుకుని, ఖాళీ హుండీని వ్యాసగుడి సమీపంలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఘటనపై సమాచారం అందుకున్న డా. జి. జానకి షర్మిల సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. చోరీ జరిగిన విధానం, సేకరించిన ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి, నిందితులను త్వరితగతిన అరెస్టు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ ఘటనతో భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ దేవాలయంలో భద్రతా లోపాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793