-->

తెలంగాణలో వాతావరణ హెచ్చరికలు.. పలు జిల్లాలకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు

 

తెలంగాణలో వాతావరణ హెచ్చరికలు.. పలు జిల్లాలకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే కొద్ది గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట్, గద్వాల, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

ఈ వర్షాల సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆయా జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు.

ఇప్పటికే శనివారం రాత్రి హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో ప్రజలకు వేసవి వేడి నుంచి ఉపశమనం లభించింది. తాజా వాతావరణ హెచ్చరికలతో మరికొన్ని జిల్లాల్లో కూడా వాతావరణం చల్లబడే అవకాశం కనిపిస్తోంది.

ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల తీవ్రత దృష్ట్యా రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. కోసిన వరి, వ్యవసాయ పరికరాలను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని హెచ్చరించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793