SIO ఆధ్వర్యంలో ఇస్లామిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్యాంప్ పోస్టర్ విడుదల
పెద్దపల్లి, మే 17: యువతలో ఇస్లామిక్ విలువలు, నాయకత్వ లక్షణాలు మరియు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు Students Islamic Organisation of India (SIO) పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించనున్న “ఇస్లామిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్యాంప్ - 2026” పోస్టర్‌ను ప్రముఖులు విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో సయ్యద్ జావీద్ అక్మల్ హుస్సేనీ (అమీర్-ఎ-ముఖామీ గోదావరిఖని), రామగుండం కార్పొరేషన్ మండల ఇంచార్జ్ ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ, జమాత్-ఎ-ఇస్లామీ హింద్ గోదావరిఖని వైస్ ప్రెసిడెంట్, టెమ్రీస్ కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే SIO యూనిట్ ప్రెసిడెంట్ ఫాజిల్ అహ్మద్ ఖాన్, సెక్రటరీ మీర్జా ఆసిఫ్, సభ్యులు ఫౌజాన్, రెహాన్ తదితరులు హాజరయ్యారు.
మూడు రోజుల రెసిడెన్షియల్ క్యాంప్‌ను మే 20 నుండి 22 వరకు పెద్దపల్లిలోని మస్జిద్-ఎ-ఫిర్దౌస్‌లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 14 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత కోసం ఈ ప్రత్యేక క్యాంప్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
క్యాంప్‌లో ఇస్లాం అవగాహన, ఖుర్ఆన్ & హదీస్ సెషన్లు, నాయకత్వ శిక్షణ, కెరీర్ మార్గదర్శనం, క్రీడలు మరియు ఇతర ప్రేరణాత్మక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఆసక్తి గల వారు వెంటనే నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. నమోదు కోసం ఈ లింక్‌ను ఉపయోగించవచ్చు:
సందేహాల నివృత్తి కోసం బ్రదర్ మిర్జా ఫైజాన్ బేగ్ (కన్వీనర్) – 9618244688, బ్రదర్ ఫాజిల్ అహ్మద్ ఖాన్ (కో-కన్వీనర్) – 85000 38347 నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.

Post a Comment