రైతు భరోసా నిధుల విడుదల.. తొలి విడతగా రూ.2,482 కోట్ల జమ
తెలంగాణ రైతులకు శుభవార్త: రైతు భరోసా నిధుల విడుదల.. తొలి విడతగా రూ.2,482 కోట్ల జమ
హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన రైతు భరోసా సదస్సులో ముఖ్యమంత్రి A. Revanth Reddy రైతు భరోసా నిధులను విడుదల చేశారు. కంప్యూటర్ బటన్ నొక్కి తొలి విడత నిధుల విడుదలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,600 రైతు వేదికల ద్వారా రైతులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు.
ప్రభుత్వం వచ్చే తొమ్మిది రోజుల్లో మొత్తం రూ.9,000 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తొలి విడతలో 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయడానికి రూ.2,482.02 కోట్లను విడుదల చేసింది.
ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ Gutta Sukender Reddy, ఉప ముఖ్యమంత్రి Mallu Bhatti Vikramarka, మంత్రులు Tummala Nageswara Rao, N. Uttam Kumar Reddy, Jupally Krishna Rao, Ponguleti Srinivasa Reddy, Vakiti Srihari, Azharuddin, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి Sanjay Jaju తదితరులు పాల్గొన్నారు.
సదస్సులో మాట్లాడిన ముఖ్యమంత్రి, గత 30 నెలల్లో వ్యవసాయ రంగానికి రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. 25.35 లక్షల మంది రైతులకు రూ.20,677 కోట్ల మేర రైతు రుణమాఫీ అమలు చేశామని, గత ప్రభుత్వ హయాంలో బకాయి పడిన రూ.7,000 కోట్ల రైతు భరోసా నిధులను కూడా చెల్లించామని చెప్పారు.
అలాగే రైతు భరోసా మొత్తాన్ని రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచామని, ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.27 వేల కోట్లకు పైగా జమ చేశామని తెలిపారు. తాజా విడతతో కలిపి రైతు భరోసా కింద మొత్తం రూ.36 వేల కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు.
పంటలకు బోనస్‌గా రూ.4 వేల కోట్లు, వ్యవసాయ పనిముట్ల కోసం రూ.2 వేల కోట్లు, పంట బీమా కోసం రూ.3.5 వేల కోట్లు అందించామని, గత రెండున్నరేళ్లలో వడ్ల కొనుగోళ్ల కోసం రూ.80 వేల కోట్లకుపైగా రైతులకు చెల్లించామని ముఖ్యమంత్రి వివరించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, గత ప్రభుత్వ అప్పులు, ఉద్యోగుల జీతాల చెల్లింపులు, ఆర్టీసీ, సింగరేణి వంటి సంస్థల ఆర్థిక పరిస్థితులపై కూడా ఆయన ప్రస్తావించారు. తెలంగాణను అప్పుల ఊబి నుంచి బయటకు తీసుకొస్తూ అభివృద్ధి దిశగా నడిపిస్తున్నామని పేర్కొన్నారు.
వ్యవసాయంపై మాట్లాడుతూ, వాతావరణ మార్పులు, ఎల్ నినో ప్రభావం కారణంగా ఈసారి వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని, అందువల్ల రైతులు పంట మార్పిడిపై దృష్టి పెట్టి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.
చివరగా, ఈ ప్రభుత్వం ప్రజలది, మహిళలది, యువతది, రైతులదని పేర్కొన్న ఆయన, రైతు భరోసా నిధులు పొందుతున్న ప్రతి రైతుకు శుభాకాంక్షలు తెలిపారు.

Post a Comment