వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారులకు వీడ్కోలు
వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారులకు వీడ్కోలు
వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారులకు ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. సుదీర్ఘకాలంగా పోలీస్ శాఖలో సేవలందించిన అధికారులను వరంగల్ పోలీస్ కమిషనర్ శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేసి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పదవీ విరమణ చేసిన అధికారులు, వారి కుటుంబ సభ్యులు, పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, పోలీస్ సేవలో ఉన్నంతకాలం ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం అంకితభావంతో పనిచేసిన అధికారులు నేటి తరం పోలీసులకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. పదవీ విరమణ అనంతరం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలని, అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ సమాజానికి సేవలు అందించాలని సూచించారు.
పదవీ విరమణ పొందిన అధికారుల్లో అడిషనల్ డీసీపీ రవి, ఎస్‌ఐలు విజయ్‌కుమార్, రాజయ్య, రవీందర్ రెడ్డి, విజయ్‌కుమార్, జనార్థన్, అమరేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, సంపత్, రమేష్, ఏఎస్‌ఐలు రమేష్, రాంధన్, బుచ్చయ్య, నర్సింగరావు, సత్తయ్య, హెడ్ కానిస్టేబుళ్లు రవికుమార్, ప్రభాకర్, కుమారస్వామి, సత్యదేవ్, కానిస్టేబుళ్లు గ్యామ, సుధాకర్, సలావుద్దీన్ ఉన్నారు.
ఈ వీడ్కోలు కార్యక్రమంలో అదనపు డీసీపీలు సురేష్‌కుమార్, శ్రీనివాస్, ఏసీపీలు అంతయ్య, సురేంద్ర, ఆర్‌ఐలు సతీష్, స్పర్జన్ రాజ్, హనుమకొండ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, ఆర్‌ఎస్‌ఐ శ్రావణ్‌కుమార్‌తో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని పదవీ విరమణ చేసిన అధికారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Post a Comment