-->

పీవీకే-5 గనిలో వైండింగ్ ఇంజన్ నిర్వహణపై హెచ్‌ఎంఎస్ ఆందోళన

 

పీవీకే-5 గనిలో వైండింగ్ ఇంజన్ నిర్వహణపై హెచ్‌ఎంఎస్ ఆందోళన
పీవీకే-5 గనిలో వైండింగ్ ఇంజన్ నిర్వహణపై హెచ్‌ఎంఎస్ ఆందోళన

కొత్తగూడెం: కొత్తగూడెం ఏరియాలోని పీవీకే-5 గనిలో శాశ్వత (పర్మనెంట్) ఆపరేటర్ల కొరత కారణంగా వైండింగ్ ఇంజన్‌ను యాక్టింగ్ ఆపరేటర్లతో నడపడం కార్మికుల భద్రతకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్‌ఎంఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.


"ఈ వార్తను వాయిస్ రూపేణా కూడా వినవచ్చును"

ఈ సందర్భంగా కొత్తగూడెం ఏరియా హెచ్‌ఎంఎస్ బ్రాంచ్ కార్యదర్శి ఆసిఫ్ మాట్లాడుతూ, పీవీకే-5 గనిలో చాలా కాలంగా డిజిగ్నేటెడ్ ఆపరేటర్లు లేకపోవడంతో యాక్టింగ్ ఆపరేటర్లతోనే వైండింగ్ ఇంజన్ నిర్వహణ కొనసాగుతోందని తెలిపారు. ప్రతిరోజూ దాదాపు వెయ్యి మంది కార్మికులు ఈ వైండింగ్ ఇంజన్‌కు అనుసంధానమైన కేజ్ ద్వారా భూగర్భ గనిలోకి వెళ్లి విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు.

అంతేకాకుండా, గనిలోకి మెటీరియల్ రవాణా కోసం ప్రత్యేక మార్గం లేకపోవడంతో సర్ఫేస్ నుంచి అవసరమైన సామగ్రిని కూడా ఇదే కేజ్ ద్వారా తరలిస్తున్నారని పేర్కొన్నారు. వందలాది మంది కార్మికుల ప్రాణాలతో ముడిపడి ఉన్న కీలకమైన వైండింగ్ ఇంజన్ నిర్వహణ బాధ్యతలను డిజిగ్నేటెడ్ ఉద్యోగులకే అప్పగించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సమస్యను గని మేనేజర్ దృష్టికి తీసుకెళ్లగా, వారు స్పందిస్తూ ఉన్నతాధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆసిఫ్ తెలిపారు. అలాగే ప్రస్తుతం యాక్టింగ్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న, వైండింగ్ ఇంజన్ టెస్ట్‌లో అర్హత సాధించిన ఉద్యోగులకు త్వరితగతిన డిజిగ్నేషన్ కల్పించే దిశగా చర్యలు చేపడతామని మేనేజ్‌మెంట్ పేర్కొన్నట్లు వెల్లడించారు.

కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని శాశ్వత ఆపరేటర్ల నియామక ప్రక్రియను వేగవంతం చేసి, వైండింగ్ ఇంజన్‌ను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేలా సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని హెచ్‌ఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పీవీకే-5 పిట్ కార్యదర్శి చిట్టిబాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శి దుర్గాప్రసాద్, శ్యామ్, కార్తీక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793