-->

అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైన దీతిక శ్రీ

 

పాల్వంచకు గర్వకారణం.. అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైన దీతిక శ్రీ

పాల్వంచకు గర్వకారణం.. అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైన దీతిక శ్రీ

పాల్వంచ, జూన్ 19: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన ఎక్స్‌ట్రీమ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థిని దీతిక శ్రీ అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన ఘనత సాధించింది. 2026లో జరగనున్న 2వ అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌కు ఆమె ఎంపిక కావడం స్థానికంగా ఆనందోత్సాహాలను నింపింది.

అకాడమీ మాస్టర్ కోనే సూరిబాబు శిక్షణలో కఠోర సాధన చేస్తున్న దీతిక శ్రీ తన ప్రతిభతో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు పొందింది. అంతేకాకుండా ప్రతిష్టాత్మక “వండర్ కిడ్ అవార్డు” అందుకోవాలనే లక్ష్యంతో మరింత పట్టుదలతో సాధన కొనసాగిస్తున్నట్లు తెలిపింది.

దీతిక శ్రీ తల్లిదండ్రులు శ్రీనివాస్, సుమలత తమ కుమార్తె సాధించిన విజయంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా SPF అసిస్టెంట్ కమాండర్ కె. చంద్రశేఖర్, సీఐ కిరణ్ దీతిక శ్రీని అభినందిస్తూ, అంతర్జాతీయ వేదికపై రాణించి పాల్వంచకు, జిల్లాకు మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

అకాడమీ మాస్టర్ కోనే సూరిబాబు మాట్లాడుతూ, దీతిక శ్రీ ఎంతో క్రమశిక్షణతో సాధన చేసే ప్రతిభావంతురాలైన విద్యార్థిని అని, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించే సామర్థ్యం ఆమెకు ఉందని పేర్కొన్నారు.

దీతిక శ్రీ సాధించిన ఈ ఘనత పాల్వంచతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు గర్వకారణంగా నిలిచింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793