-->

కవితకు ‘టీఆర్ఎస్’ పేరు వివాదం.. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ

 

కవితకు ‘టీఆర్ఎస్’ పేరు వివాదం.. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ

కవితకు ‘టీఆర్ఎస్’ పేరు వివాదం.. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ

హైదరాబాద్, జూన్ 11: తెలంగాణ రాజకీయాల్లో ‘టీఆర్ఎస్’ (TRS) పేరు చుట్టూ వివాదం మరింత ముదురుతోంది. ఎమ్మెల్సీ కవిత స్థాపించిన కొత్త పార్టీ Telangana Rakshana Senaకు ‘టీఆర్ఎస్’ సంక్షిప్త నామాన్ని కేటాయించడంపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కేంద్ర ఎన్నికల సంఘం (ECI) పరిశీలన కొనసాగిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే Bharat Rashtra Samithi ఈ అంశంపై ఈసీకి ఫిర్యాదు చేసింది. తెలంగాణ ఉద్యమంతో ‘టీఆర్ఎస్’ పేరుకు ప్రత్యేక గుర్తింపు ఉందని, అదే సంక్షిప్త నామాన్ని మరో పార్టీకి ఇవ్వడం వల్ల ఓటర్లలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని బీఆర్ఎస్ వాదిస్తోంది.

ఇదిలా ఉండగా, మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన ‘తెలంగాణ రాష్ట్రసామాజిక సేన్నా’ అనే సంస్థ కూడా ‘TRS’ సంక్షిప్త నామాన్ని తమకే కేటాయించాలని ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. దీంతో కవిత పార్టీకి ఈ అంశంలో కొత్త సవాల్ ఎదురైంది.

అంతేకాకుండా, కవిత పార్టీ పేరుపై ప్రచురించిన పబ్లిక్ నోటీసుకు వందల సంఖ్యలో అభ్యంతరాలు వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. దాదాపు 600–700 వరకు అభ్యంతరాలు ఈసీకి చేరినట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పటికే నమోదైన కొన్ని చిన్న రాజకీయ పార్టీలు కూడా ‘TRS’ సంక్షిప్త నామ వినియోగాన్ని వ్యతిరేకిస్తున్నాయి.

అయితే కీలక విషయం ఏమిటంటే, కేంద్ర ఎన్నికల సంఘం గతంలో ‘తెలంగాణ రక్షణ సేన (TRS)’ పేరుకు ప్రాథమిక ఆమోదం ఇచ్చింది. కానీ తుది నిర్ణయం అభ్యంతరాల పరిశీలన అనంతరం తీసుకోనున్నట్లు అప్పుడే స్పష్టం చేసింది. ఇప్పటివరకు ‘TRS’ పేరును తిరస్కరించినట్లు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

దీంతో కవిత ఆశించిన ‘TRS’ గుర్తింపు తుది రూపం దాల్చుతుందా? లేక అభ్యంతరాల నేపథ్యంలో ఈసీ కొత్త నిర్ణయం తీసుకుంటుందా? అన్నది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793