రాంగ్ రూట్‌లో వచ్చిన స్కూటీని ఢీకొన్న బుల్లెట్.. ఇద్దరు దుర్మరణం
రాంగ్ రూట్‌లో వచ్చిన స్కూటీని ఢీకొన్న బుల్లెట్.. ఇద్దరు దుర్మరణం
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. రాంగ్ రూట్‌లో వస్తున్న స్కూటీని ఎదురుగా వచ్చిన బుల్లెట్ బైక్ ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం సుమారు 7:30 గంటల సమయంలో వినోద్ అనే వ్యక్తి తన బుల్లెట్ బైక్‌పై గచ్చిబౌలి నుంచి హఫీజ్‌పేట్ వైపు వెళ్తున్నారు. అదే సమయంలో శ్రీకాంత్, విట్టల్ అనే ఇద్దరు వ్యక్తులు స్కూటీపై హఫీజ్‌పేట్ నుంచి గచ్చిబౌలి వైపు రాంగ్ రూట్‌లో ఏఎంబీ మాల్ ఫ్లైఓవర్‌పై ప్రయాణిస్తున్నారు.
ఈ క్రమంలో రెండు వాహనాలు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్కూటీపై ప్రయాణిస్తున్న శ్రీకాంత్, విట్టల్ అక్కడికక్కడే మృతిచెందారు. బుల్లెట్ బైక్‌పై ఉన్న వినోద్‌కు స్వల్ప గాయాలు కాగా, చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనతో ఫ్లైఓవర్‌పై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రాంగ్ రూట్‌లో ప్రయాణించడం ఎంత ప్రమాదకరమో మరోసారి ఈ ఘటన స్పష్టం చేసింది.

Post a Comment