ఆధునిక వ్యవసాయంతో అధిక లాభాలు సాధించాలి: మంత్రి దనసరి అనసూయ సీతక్క
ఆధునిక వ్యవసాయంతో అధిక లాభాలు సాధించాలి: మంత్రి దనసరి అనసూయ సీతక్క
ములుగు, జూన్ 12: రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించి, పంటల మార్పిడి, సేంద్రియ సాగు, నూతన వంగడాల వినియోగం ద్వారా అధిక దిగుబడులు, మెరుగైన లాభాలు పొందాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆమె పేర్కొన్నారు. రైతులకు ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం రుణమాఫీ కార్యక్రమం కింద రూ.21 వేల కోట్లు విడుదల చేసిందని తెలిపారు. అదేవిధంగా వరి కొనుగోళ్లలో రైతులకు ప్రోత్సాహంగా క్వింటాలుకు రూ.500 బోనస్ అందిస్తున్నట్లు చెప్పారు.
ములుగు జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తరిస్తుండటం సంతోషకరమని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా రైతులు పంటల వైవిధ్యీకరణపై దృష్టి సారించాలని, సాంకేతికతను వినియోగించి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చుకోవాలని సూచించారు.
రైతుల ఆదాయం పెంపు, వ్యవసాయ రంగ అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

Post a Comment