-->

కరీంనగర్‌లో చెత్తకు మంటలు.. దట్టమైన పొగలతో స్థానికులకు ఇబ్బందులు

కరీంనగర్‌లో చెత్తకు మంటలు.. దట్టమైన పొగలతో స్థానికులకు ఇబ్బందులు

కరీంనగర్‌లో చెత్తకు మంటలు.. దట్టమైన పొగలతో స్థానికులకు ఇబ్బందులు

కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని 6వ డివిజన్ బొమ్మకల్ బైపాస్ రాజీవ్ రహదారి ఫ్లైఓవర్ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి చెత్తకు మంటలు అంటుకుని దట్టమైన పొగలు వ్యాపించాయి. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

స్థానికుల ఆరోపణల ప్రకారం, పరిసర ప్రాంతాల్లోని ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు వేడుకల అనంతరం మిగిలిపోయిన వ్యర్థాలు, ప్లాస్టిక్ చెత్త, రసాయన పదార్థాలు, జంతువుల కళేబరాలను ఫ్లైఓవర్ పక్కన అక్రమంగా పారబోస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం మినీ డంపింగ్ యార్డుగా మారిపోయిందని వారు తెలిపారు.

చెత్త కుప్పల కారణంగా నిత్యం దుర్వాసన వెదజల్లడంతో పాటు తరచూ మంటలు చెలరేగుతున్నాయని, దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్యపై మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి అక్రమంగా చెత్త పారబోసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని స్థానిక కాంగ్రెస్ నాయకుడు మిడిదొడ్డి కపిల్ మాధవ్ హెచ్చరించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793