-->

రెడీమిక్స్ లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలు..!

రెడీమిక్స్ లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలు..!
రెడీమిక్స్ లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలు..!

విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమవరం నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా టైరు పేలింది. దీంతో డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న రెడీమిక్స్ లారీని ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది.

ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు రెడీమిక్స్ లారీ డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న కట్టంగూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదం కారణంగా కొంతసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు వాహనాలను క్రమబద్ధీకరించి రాకపోకలను పునరుద్ధరించారు. ఘటనపై కేసు నమోదు చేసిన కట్టంగూర్ పోలీసులు ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేపట్టారు

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793