-->

ములుగు జిల్లాకు ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తాం: మంత్రి సీతక్క

 

ములుగు జిల్లాకు ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తాం: మంత్రి సీతక్క
ములుగు జిల్లాకు ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తాం: మంత్రి సీతక్క

ములుగు, జూన్ 6: ములుగు జిల్లా కేంద్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాకు ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని ధనసరి అనసూయ సీతక్క ప్రకటించారు.

శనివారం ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రజా దర్బార్ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

ములుగు పట్టణంలో పెరుగుతున్న జనాభా, రవాణా అవసరాలు, వ్యాపార కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని రూ.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న డబుల్ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ రహదారి పూర్తయితే రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు పట్టణ అభివృద్ధికి దోహదపడుతుందని ఆమె అన్నారు.

అలాగే భవిష్యత్‌లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలో భాగంగా ములుగు జిల్లా కేంద్రం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులు సమీకరించి పనులు చేపట్టేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, మౌలిక సదుపాయాల విస్తరణ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793