-->

TGSWREIS గురుకుల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు

 

TGSWREIS గురుకుల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు

TGSWREIS గురుకుల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు

హైదరాబాద్, జూన్ 11: తెలంగాణ గురుకుల విద్యా వ్యవస్థలో మరో కీలక ముందడుగు పడింది. Telangana Social Welfare Residential Educational Institutions Society (TGSWREIS) బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

అణగారిన వర్గాల విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం విద్యారంగంలో సమగ్ర సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ సమావేశంలో గురుకుల డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు యూజీసీ వేతన స్కేలు అమలు దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే డిగ్రీ కళాశాలల నిర్వహణ కోసం ప్రత్యేక పరిపాలనా విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు.

విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు National Assessment and Accreditation Council గుర్తింపు సాధన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఎస్సీ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ఆర్థిక సహాయం

విదేశీ విద్య అభ్యసించేందుకు వెళ్లే ఎస్సీ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. రాష్ట్రవ్యాప్తంగా మరో 9 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేసి ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత స్థాయి శిక్షణ అందించనున్నారు.

వైద్య, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించే లక్ష్యంతో 9వ తరగతి నుంచే నీట్, జేఈఈ కోచింగ్ అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఆధునిక సాంకేతిక అవసరాలకు అనుగుణంగా గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోర్సులను కూడా ప్రవేశపెట్టనున్నారు.

ఈ నిర్ణయాలు తెలంగాణ గురుకుల విద్యను జాతీయ స్థాయిలో మరింత పోటీతత్వంతో ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా మారనున్నాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793