ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని మంత్రి వాకిటి శ్రీహరి విజ్ఞప్తి
ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని మంత్రి వాకిటి శ్రీహరి విజ్ఞప్తి
హైదరాబాద్‌లో గురువారం తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ను రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్య, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కలిసి ముదిరాజ్ సామాజిక వర్గాన్ని బీసీ-డీ నుంచి బీసీ-ఏ కేటగిరీలోకి మార్చాలని విజ్ఞప్తి చేశారు.
మంత్రి శ్రీహరి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల జనాభా 56.36 శాతం ఉండగా, అందులో ముదిరాజ్‌ల జనాభా 7.4 శాతం ఉందన్నారు. జనాభాలో గణనీయమైన వాటా ఉన్నప్పటికీ ముదిరాజ్‌లు విద్య, ఉద్యోగాలు, సంక్షేమ పథకాల అమలులో ఇంకా వెనుకబడి ఉన్నారని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉన్న బీసీ-డీ కేటగిరీలో తీవ్రమైన పోటీ కారణంగా ముదిరాజ్ యువతకు సరైన అవకాశాలు అందడం లేదని, వారిని బీసీ-ఏలోకి మార్చితే విద్య, ఉద్యోగాలు మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సమర్థవంతంగా అందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
తాను మంత్రిగా కాకుండా ముదిరాజ్ సమాజానికి చెందిన వ్యక్తిగా ఈ విజ్ఞప్తి చేస్తున్నానని శ్రీహరి తెలిపారు. ముదిరాజ్‌ల సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరారు.
ఈ సమావేశంలో బొర్రా జ్ఞానేశ్వర్, కాసాని వీరేష్, బలరామ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment