-->

బత్తాయి రైతుల సమస్యలు పరిష్కరించాలి: కల్వకుంట్ల కవిత

బత్తాయి రైతుల సమస్యలు పరిష్కరించాలి: కల్వకుంట్ల కవిత

బత్తాయి రైతుల సమస్యలు పరిష్కరించాలి: కల్వకుంట్ల కవిత

నల్గొండ జిల్లా మాడుగుల మండలం ఇందుగుల గ్రామంలో బత్తాయి తోటను తెలంగాణ రక్షణ సేన చీఫ్ Kalvakuntla Kavitha పరిశీలించారు. ఇటీవల నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో స్థానిక రైతులు బత్తాయి సాగుదారులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడంతో, వాటిని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఆమె గ్రామానికి వెళ్లి తోటలను సందర్శించారు.

ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన కవిత, నల్గొండ జిల్లాలో బత్తాయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బత్తాయి, నిమ్మ, పత్తి రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని, పంటలకు సరైన మార్కెట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. బత్తాయి రైతుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారి తరఫున పోరాటం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.

రైతుల కష్టాలను ప్రభుత్వం వెంటనే గుర్తించి, మార్కెటింగ్, నిల్వ, రవాణా సదుపాయాలపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని కవిత కోరారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793