-->

జెండా పండుగలో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా ఆవిష్కరణ

 

జెండా పండుగలో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా ఆవిష్కరణ

జెండా పండుగలో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా ఆవిష్కరణ

పేదల సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు రాజకీయ అవకాశాలే లక్ష్యం: కల్వకుంట్ల కవిత

కొత్తగూడెం, జూలై 11: తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా పండుగ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలోని మెయిన్ హాస్పిటల్ ప్రాంతం ఎంబీ క్వార్టర్స్ సమీపంలో పార్టీ జెండాను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం పార్టీ యూత్ జిల్లా నాయకుడు సాయిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, తెలంగాణ రక్షణ సేన పార్టీ ప్రధాన లక్ష్యం పేద ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్య, ఉచిత వైద్య సేవలు అందించడమేనని తెలిపారు. యువతకు రాజకీయాల్లో సముచిత అవకాశాలు కల్పించేందుకు పార్టీ కట్టుబడి ఉందని, మహిళల సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ వారి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేస్తూ, తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన కోసం ఉద్యమిస్తామని ఆమె అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తెలంగాణ రక్షణ సేన ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ వీరన్న, వాసం రామకృష్ణ, దొర, కోరం వెంకటేశ్వర్లు, మాధవీలతతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జెండా పండుగను ఘనంగా నిర్వహించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793