జోన్–IV పోలీస్ డ్యూటీ మీట్–2026లో భద్రాద్రి పోలీసుల సత్తా
జోన్–IV పోలీస్ డ్యూటీ మీట్–2026లో భద్రాద్రి పోలీసుల సత్తా
3 స్వర్ణ, 7 రజత, 2 కాంస్య పతకాలతో మొత్తం 12 పతకాలు సాధించిన జిల్లా పోలీసు సిబ్బంది. విజేతలను అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
జోన్–IV పోలీస్ డ్యూటీ మీట్–2026లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు సిబ్బంది విశేష ప్రతిభ కనబరిచి మొత్తం 12 పతకాలు సాధించారు. వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో జిల్లా పోలీసు సిబ్బంది 3 స్వర్ణ పతకాలు, 7 రజత పతకాలు, 2 కాంస్య పతకాలు కైవసం చేసుకుని జిల్లా పోలీసు శాఖకు గర్వకారణంగా నిలిచారు.
ఈ సందర్భంగా విజేతలను జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐపీఎస్ అభినందించారు. కఠినమైన విధులతో పాటు డ్యూటీ మీట్ పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ, విధి నిర్వహణలో మరింత సమర్థతను కనబరచాలని సూచించారు.
జోన్ స్థాయిలో సాధించిన ఈ విజయాలను రాష్ట్ర, జాతీయ స్థాయిల్లోనూ కొనసాగించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు శాఖకు మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు. క్రమశిక్షణ, అంకితభావం, నిరంతర సాధనతో ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయని పేర్కొంటూ విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ విజయంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు సిబ్బంది మరోసారి తమ ప్రతిభను చాటుకుని, పోలీసు శాఖలో ప్రత్యేక గుర్తింపు పొందారు. అధికారులు, సహచర పోలీసులు విజేతలను అభినందిస్తూ, రాబోయే పోటీల్లో కూడా ఇదే జోరును కొనసాగించాలని ఆకాంక్షించారు.

Post a Comment