లండన్‌లో అంబేద్కర్ హౌస్‌ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
లండన్‌లో అంబేద్కర్ హౌస్‌ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
లండన్‌లోని ప్రముఖ అంబేద్కర్ హౌస్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సందర్శించారు. 1921-22లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నివసించిన 10 కింగ్ హెన్రీ’స్ రోడ్‌లోని ఈ చారిత్రక భవనాన్ని ప్రస్తుతం అంబేద్కర్ ఆశయాలను ప్రతిబింబించే మ్యూజియంగా తీర్చిదిద్దారు.
దాదాపు గంటపాటు మ్యూజియాన్ని సందర్శించిన సీఎం.. సామాజిక న్యాయం కోసం అంకితభావంతో పనిచేయాలన్న తన సంకల్పం మరింత బలపడిందని సందర్శకుల డైరీలో పేర్కొన్నారు. అంబేద్కర్ జీవితానికి సంబంధించిన విశేషాలను ఏసీడీఏ చైర్‌పర్సన్ సంతోష్ దాస్ వివరించారు.
అంబేద్కర్‌తో ముడిపడిన వస్తువులను చూడటం, ఆయన జీవితంలోని వ్యక్తిగత కోణాలను తెలుసుకోవడం తన జీవితంలోని గొప్ప క్షణాల్లో ఒకటని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Post a Comment