కాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీకి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు
కాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీకి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు
హైదరాబాద్, ఆగస్టు 30: ప్రముఖ సామాజిక కార్యకర్త కాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ జన్మదినం సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఈ-మెయిల్ ద్వారా ఆయనకు జన్మదిన శుభాకాంక్షల సందేశాన్ని పంపించారు.
ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన అధికారిక జన్మదిన శుభాకాంక్షల సేవ ద్వారా ఈ సందేశం అందినట్లు కాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, రానున్న సంవత్సరం ఆయన జీవితంలో మరింత ఆనందం, సంతోషం, విజయాలను తీసుకురావాలని ప్రధాని ఆకాంక్షించారు.
“మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ జీవితంలో మరింత ఆనందం, సంతోషం మరియు విజయాలను తీసుకురావాలని కోరుకుంటున్నాను” అని ప్రధాని నరేంద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.
ప్రధాని నుంచి తన జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందుకోవడం ఎంతో ఆనందంగా, గౌరవంగా, మరపురాని అనుభూతిగా ఉందని కాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Post a Comment