-->

ఎలుకల దాడి.. ఖమ్మం జిల్లా గురుకులంలో ఆరుగురు విద్యార్థినులకు గాయాలు

 

ఎలుకల దాడి.. ఖమ్మం జిల్లా గురుకులంలో ఆరుగురు విద్యార్థినులకు గాయాలు

ఎలుకల దాడి.. ఖమ్మం జిల్లా గురుకులంలో ఆరుగురు విద్యార్థినులకు గాయాలు

ఖమ్మం జిల్లా: పెనుబల్లి మండలం అడవిమల్లె తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల హాస్టల్‌లో ఎలుకల బెడద తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. హాస్టల్‌లో నిద్రిస్తున్న ఆరుగురు విద్యార్థినులను ఎలుకలు కరవడంతో కలకలం రేగింది.

ఎలుకల దాడిలో గాయపడిన విద్యార్థినులను వెంటనే లంకాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యులు వారికి పరీక్షలు నిర్వహించి, ర్యాట్ బైట్‌ నివారణకు అవసరమైన యాంటీ వ్యాక్సిన్ డోస్‌ ఇచ్చారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.

అయితే హాస్టల్‌లో ఎలుకలు కరవడం ఇదే తొలిసారి కాదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని, ఎలుకల భయంతో రాత్రివేళల్లో ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నామని వారు చెబుతున్నారు.

హాస్టల్‌లో పారిశుద్ధ్య పరిస్థితులు, ఆహార నిల్వలు, ఎలుకల నియంత్రణ చర్యలపై అధికారులు తక్షణం దృష్టి సారించాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థినుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు హాస్టల్‌లో ఎలుకల నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793