-->

నల్గొండలో విషాదం.. మగబిడ్డ పుట్టలేదని బాలింత ఆత్మహత్య

 

నల్గొండలో విషాదం.. మగబిడ్డ పుట్టలేదని బాలింత ఆత్మహత్య

 నల్గొండలో విషాదం.. మగబిడ్డ పుట్టలేదని బాలింత ఆత్మహత్య

నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. మగబిడ్డ పుట్టలేదనే ఆవేదనతో ఓ బాలింత చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.

మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన మమత ప్రసవం కోసం వారం రోజుల క్రితం నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ప్రసవం అనంతరం ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మమతకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉండగా.. నాలుగోసారి కూడా ఆడపిల్లే పుట్టడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ఆసుపత్రి ఆవరణలోని ఓ చెట్టుకు ఉరేసుకుని మమత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

కాగా, ఆడపిల్ల పుట్టిందనే కారణంతో అత్తింటి వారు మమతను వేధించారని, మానసికంగా ఒత్తిడికి గురిచేశారని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. వారి వేధింపులే ఆత్మహత్యకు ప్రధాన కారణమని పేర్కొంటున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. మమత ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు, ఇతర వివరాల ఆధారంగా పోలీసులు తదుపరి చర్యలు చేపట్టనున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793