రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ ధనుంజయ దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ ధనుంజయ దుర్మరణం
జనగామ జిల్లా: జనగామ–కొమ్మల్ల మధ్య ఉన్న టోల్‌గేట్ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ ధనుంజయ మృతి చెందారు. బైక్‌పై ప్రయాణిస్తున్న ఆయన ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలై ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
ధనుంజయ కొద్దిరోజుల క్రితమే పాలకుర్తి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Post a Comment