-->

బొగ్గు లారీలపై ఉక్కుపాదం.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: సీపీ అంబర్ కిశోర్ ఝా

 

అంబర్ కిశోర్ ఝా

బొగ్గు లారీలపై ఉక్కుపాదం.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: సీపీ అంబర్ కిశోర్ ఝా

గోదావరిఖని: నిబంధనలను విస్మరించి రాకపోకలు సాగిస్తున్న బొగ్గు లారీలపై కఠిన చర్యలు తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అధికారులను ఆదేశించారు.

బుధవారం తన కార్యాలయంలో శాంతిభద్రతలు, ట్రాఫిక్, రవాణాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రజల సురక్షిత ప్రయాణమే ప్రధాన లక్ష్యంగా రోడ్డు భద్రతా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు.

ఇసుక, బొగ్గు (కోల్), యాష్ తదితర పదార్థాలను తరలించే వాహనాలు తప్పనిసరిగా టార్పాలిన్ కవర్లతో కప్పి రవాణా చేయాలని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని వాహన యజమానులు, డ్రైవర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అలాగే పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్న ఆటోలు, ఇతర విద్యాసంస్థల వాహనాలపై కూడా ప్రత్యేక తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో సహాయం అందించే 'రహ్-వీర్' పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, మంచిర్యాల డీటీవో గోపీకృష్ణ, రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల ట్రాఫిక్ సీఐలు రాజేశ్వరరావు, శ్రీనివాస్, హనన్, మంచిర్యాల మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793