-->

ఆసియా కరాటే ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు మహేష్ కుమార్ గౌడ్ అభినందనలు

 

ఆసియా కరాటే ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు మహేష్ కుమార్ గౌడ్ అభినందనలు

ఆసియా కరాటే ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు మహేష్ కుమార్ గౌడ్ అభినందనలు

హైదరాబాద్, ఆగస్టు 21: ప్రతిష్ఠాత్మక 2026 AKF క్యాడెట్, జూనియర్, అండర్-21 ఆసియా కరాటే ఛాంపియన్‌షిప్‌కు తెలంగాణకు చెందిన నలుగురు కరాటే క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ స్పోర్ట్స్ కరాటే-డూ అసోసియేషన్ అధ్యక్షులు, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ క్రీడాకారులను ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సన్మానించి అభినందించారు.

జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో సెప్టెంబర్ 4 నుంచి 11 వరకు జరగనున్న ఆసియా కరాటే ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన విషాల్ రెడ్డి అమ్రాడి (-61 కేజీ), సత్య తేజ బ్రహ్మాండాని (+66 కేజీ), నిష్ఠ గంగిసెట్టి (-61 కేజీ), శశాంక్ సాత్విక్ లంకె (-52 కేజీ) పోటీపడనున్నారు.

ఆసియా స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించి తెలంగాణతో పాటు దేశానికి మంచి పేరు తీసుకురావాలని మహేష్ కుమార్ గౌడ్ ఆకాంక్షించారు. క్రీడాకారుల తల్లిదండ్రులు, కోచ్‌లను కూడా ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఇండియన్ హెడ్ కోచ్, KIO జాయింట్ సెక్రటరీ కీర్తన్, కరాటే స్టేట్ జనరల్ సెక్రటరీ మల్యాల రామస్వామి, జాయింట్ సెక్రటరీ వెంకటేష్, కోచ్ నరేష్, ఎం. రాజు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793