భద్రాద్రి జిల్లా జాతీయ లోక్ అదాలత్‌లో 5,774 కేసుల పరిష్కారం
భద్రాద్రి జిల్లా జాతీయ లోక్ అదాలత్‌లో 5,774 కేసుల పరిష్కారం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా మొత్తం 5,774 కేసులు పరిష్కారమయ్యాయి. వివిధ కోర్టుల పరిధిలో సివిల్, క్రిమినల్, బ్యాంకు, పీఎల్‌సీ, ట్రాఫిక్ చలాన్ తదితర కేసులను పరిష్కరించారు.
కొత్తగూడెం:
కొత్తగూడెం కోర్టు పరిధిలో మొత్తం 3,384 కేసులు పరిష్కరించారు. ఇందులో సివిల్ కేసులు 32, క్రిమినల్ కేసులు 2,391 ఉన్నాయి. బ్యాంకు కేసులు 193, టెలిఫోన్ కేసులు 9, సైబర్ క్రైమ్ కేసులు 57, ట్రాఫిక్ చలాన్ కేసులు 702 పరిష్కారమయ్యాయి. అలాగే 8 మోటార్ వాహన ప్రమాద కేసుల్లో రూ.37.50 లక్షలకు పరిష్కారం కుదిరింది.
ఇల్లందు:
ఇల్లందులో మొత్తం 602 కేసులు పరిష్కరించారు. ఇందులో సివిల్ కేసులు 11, క్రిమినల్ కేసులు 347, బ్యాంకు మరియు ప్రామిసరీ నోట్ కేసులు 169, ట్రాఫిక్ చలాన్ కేసులు 75 ఉన్నాయి.
భద్రాచలం:
భద్రాచలంలో మొత్తం 1,121 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో క్రిమినల్ కేసులు 1,057, బ్యాంకు, పీఎల్‌సీ కేసులు 27, ట్రాఫిక్ చలాన్ కేసులు 37 ఉన్నాయి.
మణుగూరు:
మణుగూరు కోర్టు పరిధిలో మొత్తం 422 కేసులు పరిష్కరించారు. ఇందులో క్రిమినల్ కేసులు 338, బ్యాంకు పీఎల్‌సీ కేసులు 32, ట్రాఫిక్ చలాన్ కేసులు 52 ఉన్నాయి.
దమ్మపేట:
దమ్మపేటలో మొత్తం 245 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో క్రిమినల్ కేసులు 168, సివిల్ కేసులు 2, బ్యాంకు పీఎల్‌సీ కేసులు 38, ట్రాఫిక్ చలాన్ కేసులు 37 ఉన్నాయి.
జాతీయ లోక్ అదాలత్ ద్వారా వివిధ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించడంతో కక్షిదారులకు సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు కేసుల పరిష్కారానికి మార్గం సుగమమైంది.

Post a Comment