-->

గణేశ్ నవరాత్రుల సందర్భంగా శాంతి కమిటీ సమావేశం

 

గణేశ్ నవరాత్రుల సందర్భంగా శాంతి కమిటీ సమావేశం తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్

గణేశ్ నవరాత్రుల సందర్భంగా శాంతి కమిటీ సమావేశం తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ 

తూప్రాన్, సెప్టెంబర్ 12: గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు శనివారం తూప్రాన్ పట్టణంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ, విద్యుత్ శాఖ అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ముస్లిం మత పెద్దలు, గణేశ్ మండపాల నిర్వాహకులు, తూప్రాన్ మండల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డీఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ గణేశ్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. శాంతిభద్రతలు, మత సామరస్యం, ట్రాఫిక్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ పోలీసు, ఇతర శాఖల అధికారులకు సహకరించాలని కోరారు.

ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని డీఎస్పీ సూచించారు. ప్రజలంతా పరస్పర సహకారంతో గణేశ్ నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని ఆయన కోరారు.

Blogger ఆధారితం.