-->

తూప్రాన్‌లో ఆస్తి నేరాలపై నిందితుడి అరెస్ట్ బైక్, గ్యాస్ సిలిండర్ తదితర చోరీ సొత్తు స్వాధీనం

 

తూప్రాన్‌లో ఆస్తి నేరాలపై నిందితుడి అరెస్ట్ బైక్, గ్యాస్ సిలిండర్ తదితర చోరీ సొత్తు స్వాధీనం

తూప్రాన్‌లో ఆస్తి నేరాలపై నిందితుడి అరెస్ట్ బైక్, గ్యాస్ సిలిండర్ తదితర చోరీ సొత్తు స్వాధీనం

సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో నిందితుడి గుర్తింపు

తూప్రాన్, సెప్టెంబర్ 1: తూప్రాన్ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న షట్టర్ లిఫ్టింగ్ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరాల ఫుటేజీతో పాటు సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు తూప్రాన్ సీఐ వెంకట రాజా గౌడ్ తెలిపారు.

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. మఠంపల్లి, సూర్యాపేట జిల్లాకు చెందిన మామిడి శ్రీకాంత్ (31) ఈ కేసులో నిందితుడిగా గుర్తించినట్లు తెలిపారు. నిందితుడు ఇప్పటికే మరో కేసులో నల్గొండ జైలులో ఉన్న నేపథ్యంలో మెదక్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి, అనంతరం సిద్దిపేట జైలుకు తరలించినట్లు వెల్లడించారు.

తూప్రాన్ పట్టణంలో ఇటీవల జరిగిన వరుస ఆస్తి నేరాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు సీఐ తెలిపారు. సీసీ కెమెరాల ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు, ఇతర దర్యాప్తు పద్ధతులను ఉపయోగిస్తూ నిందితులను గుర్తిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం అరెస్ట్ చేసిన నిందితుడి నుంచి బైక్, గ్యాస్ సిలిండర్ తదితర చోరీ సొత్తును రికవరీ చేసినట్లు తెలిపారు.

అదేవిధంగా నిందితుడికి ఇతర ఆస్తి నేరాలతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు సీఐ వెల్లడించారు. నిందితుడి విచారణలో వెలుగులోకి వచ్చే సమాచారంతో పాటు సీసీ కెమెరా, ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తూ తూప్రాన్ పట్టణం, పరిసర ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న ఇతర ఆస్తి నేరాలను కూడా ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

ఇప్పటికే పలు కేసుల్లో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసిన తూప్రాన్ పోలీసులు.. దర్యాప్తులో వెలుగులోకి వచ్చే ఇతర కేసులను కూడా త్వరలోనే ఛేదిస్తామని స్పష్టం చేశారు.

ప్రజలకు పోలీసుల భరోసా

తూప్రాన్ పట్టణంలో నేరస్తులకు చోటు లేదని సీఐ వెంకట రాజా గౌడ్ అన్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, ప్రతి నేరాన్ని సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సీసీ కెమెరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నేరస్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ప్రజల భద్రతకు తూప్రాన్ పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారని సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు గంగరాజు, యాదగిరితో పాటు పీసీలు మహేష్, కృష్ణ, గోవర్ధన్, సురేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793