-->

ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

గాంధీజీ సత్యం, అహింసా మార్గాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శం: ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

గాంధీజీ సత్యం, అహింసా మార్గాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శం: ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ.. మహాత్మా గాంధీజీ చూపిన సత్యం, అహింసా మార్గాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేసిన పోరాటం, ఆయన పాటించిన విలువలు నేటి సమాజానికి కూడా మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

గాంధీజీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని ఎస్పీ సూచించారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, పరస్పర గౌరవం, సామాజిక బాధ్యత వంటి విలువలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

పోలీసు శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బంది ప్రజలకు మరింత బాధ్యతాయుతంగా సేవలందిస్తూ, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని ఎస్పీ సూచించారు. గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు న్యాయం, భద్రత కల్పించడంలో పోలీసు సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని మహాత్మా గాంధీజీకి ఘనంగా నివాళులర్పించారు.

Blogger ఆధారితం.