-->

కాగజ్‌నగర్‌లో రిటైర్డ్ టీచర్ ఇంట్లో భారీ చోరీ

 

కాగజ్‌నగర్‌లో రిటైర్డ్ టీచర్ ఇంట్లో భారీ చోరీ

కాగజ్‌నగర్‌లో రిటైర్డ్ టీచర్ ఇంట్లో భారీ చోరీ

కాగజ్‌నగర్: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని బాలాజీనగర్ శివాజీ చౌక్, పోస్టాఫీస్ సమీపంలో రిటైర్డ్ టీచర్ ఇంట్లో చోరీ జరిగిన ఘటన కలకలం రేపింది. ఇంటి యజమానులు గత వారం రోజులుగా అనారోగ్యంతో కరీంనగర్‌లోని ఆస్పత్రికి వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగినట్లు తెలుస్తోంది.

రిటైర్డ్ టీచర్ తాటి రవీందర్ ఇంటికి పనిమనిషి వెళ్లి చూడగా ఇంట్లో చోరీ జరిగిన విషయం గుర్తించింది. వెంటనే ఈ విషయాన్ని ఇంటి యజమానులకు, పోలీసులకు సమాచారం అందించింది.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చోరీ జరిగిన తీరును తెలుసుకునేందుకు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లను రప్పించి ఆధారాల కోసం తనిఖీలు చేపట్టారు. ఇంట్లోని వస్తువులను పరిశీలించి దొంగలు ఏ మార్గంలో ప్రవేశించి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

బాధితుడు తాటి రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో ఉన్న తులం బంగారు గొలుసు, అర తులం బంగారు కొమ్మలు చోరీకి గురయ్యాయి. చోరీకి గురైన బంగారం విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ దొంగల ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Blogger ఆధారితం.